ప్రజాశక్తి-గుత్తి (అనంతపురం) : అక్రమంగా తరలిస్తున్న 141 క్వింటాళ్లు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్న ఘటన అనంతపురం జిల్లాలోని మార్నేంపల్లి బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తురన్న సమాచారం అందడంతో మార్నేంపల్లి గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. ఈ తనీఖీల్లో ఐచర్ వాహనంలో తరలిస్తున్న 141 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేసి రెవెన్యూ అధికారులు అప్పగించినట్లు తెలిపారు. ఈ బియ్యం కర్ణాటకలోని బంగారు పేటకు తరలిస్తున్నట్లు తెలిపారు.










