Jun 13,2022 11:46

ఏర్పేడు (చిత్తూరు) : ఏర్పేడు మండలం మర్రిమంద బీసీ కాలనీలో సోమవారం ' గడపగడపకు సిపిఎం ' కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానికుల సమస్యలపై సిపిఎం జిల్లా నాయకులు హేమలత, మండల నాయకులు చర్చించారు. ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అంతా కలిసి పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.