భీమవరం (పశ్చిమ గోదావరి) : ఈ నెల 24 న విజయవాడలో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రజలంతా తరలి రావాలని మాజీ ఎంపి, సిపిఎం రాష్ట్ర నాయకులు పి.మధు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలో సిపిఎం ప్రచార యాత్రను పార్టీ జెండాను ఊపి పి.మధు ప్రారంభించారు. ప్రజలపై బిజెపి ప్రభుత్వ దాడులను అంతా ప్రతిఘటించాలని, విజయవాడలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.










