ప్రజాశక్తి-విజయవాడ : సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా ప్రణాళికను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు - వాటి పరిష్కారానికై అన్ని జిల్లాలో అనేక సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, రమాదేవి పాల్గొన్నారు.










