కొత్తపేట: ''మతోన్మాద బీజేపీని తరిమికొడదాం.. దేశాన్ని కాపాడుకుందాం '' సిపిఎం, సిపీఐ ప్రచార భేరిలో భాగంగా విజయవాడ, ఒన్‌టౌన్‌లోని కొత్తపేటలో సిపిఎం,సిపీఐ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ప్రచార భేరి ముగింపు సభ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురి ఆకట్టుకున్నాయి.











