Aug 01,2022 13:00

వెదురుకుప్పం (చిత్తూరు) : వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం సచివాలయ పరిధిలో నూతనంగా ప్రభుత్వం ద్వారా మంజూరైన 31 మంది పింఛన్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కుమారి, ఎంపిటిసి పుష్పా విజయ్ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి మోహన్‌ కుమార్‌, నాయకులు కె.రవికుమార్‌ రెడ్డి, బి.నరేష్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ రెడ్డి, చిన్ని, వెంకటముని, ఈశ్వర్‌ రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పింఛన్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.