ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో లోన్ యాప్లు వేధింపులు వల్ల యువకుడు బలి అయ్యాడు. లంకా మణికంఠ (25) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










