ప్రజాశక్తి-విజయవాడ : లోన్‌యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మృతుడు రాజేష్ ఓ లోన్ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించలేదని యాప్ నిర్వాహకులు తరచూ వేధిస్తున్నారు. ఈ క్రమంలో యాప్ నిర్వాహకులు ఈ వ్యక్తి ఫొటోలు మార్ఫింగ్ చేసి మానసిక వేధనకు గురిచేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను భార్యకు పంపడంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










