కదిరి టౌన్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని టిడిపి నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27న యువగళం పేరుతో ప్రారంభమయ్యే మహా పాదయాత్రకు యువకులు నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు అండగా నిలబడి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంగయ్య నాయుడు, ముస్లిం మైనారిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆహ్మద్ అలీ, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, కె.పి.సల్మాన్ ఖాన్, రోషన్ తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్, హిందూపురం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం మండల పరిధిలోని జానకంపల్లి గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోటిఎన్‌ఎస్‌ఎఫ్ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంటు కార్యదర్శి సుధాకర్, తెలుగు యువత సురేందర్ రెడ్డి, విజరు, టైలర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చ ఏయాలని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి ,నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దనకుంట ఈరన్న వేర్వేరు కార్యక్రమాల్లో కోరారు. ఈసందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొత్తచెరువు : మండలంలోని మైలేపల్లి కరుణా వృద్ధాశ్రమంలో టిడిపి నాయకులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ, అనంతపురం టీడీపీ నగర అధ్యక్షులు వడ్డే సిమెంట్ పోలన్న, దళవాయి పెదమారెప్ప కలసి 50మందికి దుప్పట్లు, పళ్లుపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు జరిపిటి కృష్ణమూర్తి, కళ్యాణదుర్గం నాయకులు నాగరాజు, అనంతపురం నగర తెలుగు యువత ఉపాధ్యక్షులు దలవాయి వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : నారా లోకేష్ యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్రకు సంబందించిన పోస్టర్లను రాష్ట్ర కార్యానిర్వాహక కార్యదర్శి సవితమ్మ సోమవారం ఆవిష్కరించారు. ఈ మేరకు ఆమె పట్టణంలోని తన కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం పాదయాత్ర పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్‌లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు, చంద్రమౌళి, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, రొద్దం మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు, సోమందేపల్లి డివి ఆంజనేయులు,గుట్టూరు సూర్యనారాయణ, ఎస్సీ సెల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని టిడిపి నాయకులు కోరారు. ఈసందర్బంగా మండలంలోని తురకలాపట్నం గ్రామంలో లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామగోపాల్, ప్రశాంత్, శ్రీనివాసులు, నరసింహమూర్తి, హరికృష్ణ, నాగేంద్ర, చక్రి, అనిల్, నారాయణ, లక్ష్మీపతి, కాంతప్ప, శ్రీకాంత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా కంబాలపల్లి గ్రామంలో సర్పంచ్ మంజు ఆధ్వర్యంలో లోకేశ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
పుట్టపర్తి అర్బన్ : ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి విజయం ఖాయమని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ జన్మదినం సందర్భంగా సోమవారం ప్రశాంతి గ్రామ్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, గూడూరు ఓబులేసు, ఊరు వాకిలి సురేష్, సాలక్క గారి శ్రీనివాసులు, గజ్జల వెంకట రాముడు, అంబులెన్స్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతుకును సిఎం జగన్ నొక్కేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి విమర్శించారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ముఖ్యమంత్రి జగన్ జీవో నెంబర్ ఒకటిని తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో పింఛన్లను తొలగించారనిపేద ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందన్నారు. కందుకూరు ఘటనలో వైసీపీ కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా స్వేచ్ఛగా 3,648కిలోమీటర్లు, 341రోజులు పాదయాత్ర చేస్తే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రతను కల్పించిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు రొద్దం నరసింహులు, చిన్న వెంకట రాముడు, కేశవయ్య, చిన్నప్పయ్య, కురుబ కృష్ణమూర్తి, సిద్దయ్య, సిద్దలింగప్ప, పాలడుగు చంద్ర, పోతిరెడ్డి, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రను విజయవంతం చేద్దాం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రను విజయవంతం చేద్దామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి పిలుపునిచ్చారు. యువ గళం పాదయాత్ర విజయవంతం కావాలని సోమవారం పట్టణంలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. దర్గా, చర్చి వద్ద ప్రార్థనలు చేశారు. లోకేష్ జన్మదినం సందర్భంగా 40 కేజీల కేక్‌కు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సిద్దయ్య, సిద్దలింగప్ప, లక్ష్మి రెడ్డి, టౌన్ కన్వీనర్ రవి శంకర్,గాయత్రి తదితరులు పాల్గొన్నారు.










