Jul 08,2021 16:52

లక్నో : యుపిలో ఎన్నికల హింస చెలరేగింది. బిజెపిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నోలో ఈ నెల 10న బ్లాక్‌ చైర్మన్‌ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 8 సీట్లకు జరగబోయే బ్లాక్‌ చైర్మన్‌ ఎన్నికలకు నేడు నామినేషన్ల వేసేందుకు ఎన్నికల కార్యాలయానికి నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. అయితే, నామినేషన్ల ఘట్టం హింసాత్మకంగా మారింది. బిజెపికి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పిడిగుద్దులు గుద్దుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుందేమోనని భావించిన పోలీసులు ఆందోళనాకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జ్‌ చేశారు. ఈ క్రమంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.