హైదరాబాద్ : కుస్తీ పోటీల్లో కొమ్ములాట చోటుచేసుకుంది. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన కుస్తీలో పోటీల్లో ఘర్షణ చెలరేగింది. 'మేమే గెలిచామంటూ' ఇరు వర్గాల కుస్తీ జట్లు వాదనలకు దిగారు. వాదనలు తారాస్థాయికి చేరి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణలో అనేక మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










