న్యూఢిల్లీ : నాలుగువేలమంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ఫిలిప్స్ కంపెనీ ప్రకటించింది. కంపెనీ మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఈ ప్రకటన విడుదల చేసింది. ఉత్పాదకతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 4 వేల మంది సిబ్బందిపై వేటు వేయనున్నామని, ఈ నిర్ణయం కష్టమైనప్పటికీ..తప్పలేదని ఫిలిప్స్ సిఇఒ రాయ్ జాకోబ్స్ తెలిపారు. కార్యాచరణ, సరఫరా సవాళ్లతో త్రైమాసిక విక్రయాలు ప్రభావితమయ్యాయని వెల్లడించింది. ఈ నెల 12న అందించిన సమాచారం ప్రకారం.. అమ్మకాలు 4.3 బిలియన్ యూరోలు ఉండగా, విక్రయాల్లో 5 శాతం క్షీణత నమోదైనట్లు వివరించింది. సరఫరా వ్యవస్థలోని సమస్యలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో కరోనా వ్యాప్తి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వంటి పరిణామాలు కంపెనీ విక్రయాలపై ప్రభావం చూపాయన్నారు.










