- మహిళల టీ20 వర్డల్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ గెలుపు
- ఆసీస్ ఖాతాలో ఆరోసారి
కేప్‌టౌన్: మహిళల టీ20 వరల్డ్‌కప్-2023 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. దీంతో వరసగా ఆరోసారి ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకునిరికార్డు సృష్టించింది. కేప్‌టౌన్ ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కుదిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. మూనీ (74 నాటౌట్) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనకుదిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. లారా వాల్వార్ట్ (61), ట్రయాన్ (25) మినహా మిగతా వారెవ్వరూ పెద్దగా రాణించలేదు. దీంతో మ్యాచ్ ఆస్ట్రేలియా సొంతమైంది. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా బెత్ మూనీ, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా ఆస్లెహై గార్డెనర్ ఎంపికయ్యారు.
ఫైనల్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకుఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోరు 36 పరుగుల వద్ద ఓపెనర్ హేలీ (18) మిరాజనేుకాప్ బౌలింగ్‌లో నడైన్ డె క్లర్క్‌కుక్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గార్డెనర్ (29) పరుగులకే ఔటయ్యింది. ఆ తర్వాత 103 పరుగుల వద్ద హారిస్ (10), 122 పరుగుల వద్ద లానిుంగ్ (10) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా మరో ఓపెనర్ మూనీ మాత్రం సమర్థవంతంగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించింది.
లక్ష్యఛేదనలో సఫారీల జట్టు ఆదిలోనే తడబడింది. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద బ్రిట్స్ (10) బ్రౌన్ బౌలింగ్‌లో తహిలా మెక్‌గ్రాత్‌కుక్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆతర్వాత మరిజనేు కాప్ (11), సునీలూస్ (2), ట్రాయాన్ (25), బోచ్ (1) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. వాల్వార్ట్ (61) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో 20 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 137 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాఆన్ స్కౌట్, గార్డెనర్,బ్రౌన్, జెస్ జోనస్సేన్ తలో వికెట్ పడగొట్టారు.










