విజయవాడ : విజయవాడలో వృద్ధురాలి కిడ్నాప్ కలకలం రేపింది. రాత్రి 9 గంటల సమయంలో నారాయణపురం పెట్రోల్ బంకు ప్రాంతంలో ఓ వఅద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. కారులో తీసుకెళుతుండగా... 'రక్షించండి..' అంటూ ఆ వృద్ధురాలు కేకలు పెట్టింది. వృద్ధురాలి అరుపులు విన్న ఓ ఆటో డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. కంట్రోల్ రూమ్‌లో సీసీ ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.










