ప్రజాశక్తి-నందిగామ : ఎల్ఐసి ఏజెంట్లు సంక్షేమానికి ప్రభుత్వం పథకాలు అమలు చేయాలని ఎల్ఐసి ఏజెంట్ల సంఘం మచిలీపట్నం బ్రాంచ్ ఉపాధ్యక్షులు వెంగళరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నందిగామ పట్టణ శివారు అనాధ సాగరం గ్రామ పరిధిలో నందిగామ చందర్లపాడు ఎల్ఐసి ఏజెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎల్ఐసి ఏజెంట్ల సంఘం మచిలీపట్నం బ్రాంచ్ ఉపాధ్యక్షులు వెంగళరావు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమానికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని కోరారు. ఏజెంట్ల కమిషన్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఐసి సంస్థను ప్రభుత్వం కాపాడాలని కోరారు. అనంతరం సీనియర్ ఎల్ఐసి ఏజెంట్లను పలువురు ఎల్ఐసి ఏజెంట్లు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్ల సంఘం ఉపాధ్యక్షులు బొమ్మ కంటి ప్రసాద్, కార్యదర్శి ,టి. శ్రీనివాస్, కోశాధికారి శీలం పుల్లారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి తాటి నరేంద్ర, కార్యదర్శి సైదులు, చీఫ్ ఇంచార్జ్ కొండయ్య, నరసింహారావు, వత్సవాయి ఇంచార్జి పిండిప్రోలు నరసింహారావు, నందిగా ఇన్చార్జి అశోక్, చందర్లపాడు ఇన్చార్జి ఆంజనేయులు, మహిళా ఇన్చార్జి శివకుమారి తదితరులు పాల్గొన్నారు.










