Apr 28,2023 16:15

ప్రజాశక్తి-అమలాపురం : ఈ భూమిపై మానవాళి ఉన్నంత కాలం మార్క్సిజం బతికే ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పచ్చిమాల వసంత్ కుమార్ సంస్మరణ సభ అమలాపురం రూరల్ వన్నె చింతలపూడి గ్రామంలో సిపిఎం జిల్లా కన్వీనర్ కే.వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగింది. సంత కుమార్ చిత్రపటానికి పలువురు దళిత, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు, అంబేద్కర్ లిస్టులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ వసంత కుమార్ మృతి సిపిఎంకి తీరని లోటన్నారు. తాను నమ్మిన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం శ్రమించడంతోపాటు ప్రజల్లో చాలా అభిమానం సంపాదించారన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ వసంత కుమార్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతిని ప్రకటించారు.