Jul 24,2023 11:17

లక్నో :  వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (పురావస్తు శాఖ- ఎఎస్‌ఐ) శాస్త్రీయ సర్వేను ప్రారంభించింది. ఎఎస్‌ఐ సర్వేను మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ బాయ్ కాట్‌ చేసింది. ముస్లిం తరపు సభ్యులెవరూ ఈ సర్వేలో పాల్గనరని మసీద్‌ కమిటీ జాయింట్‌ సెక్రటరీ సయ్యద్‌ మొహమ్మద్‌ పేర్కొన్నారు. తనిఖీకి అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మనీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.

ఉదయం ఏడుగంటలకు ఎఎస్‌ఐ అధికారులు మసీదు ప్రాంతానికి చేరుకున్నారు. సీల్డ్‌ ప్రాంతమైన వాజూఖానా తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వారణాసి జిల్లా కోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్‌ 4న ఈ సర్వేపై నివేదికను సమర్పించాల్సి వుంది.