ప్రజాశక్తి-పత్తికొండ : ఓ పి ఎస్ సాధించేంతవరకు కలిసికట్టుగా పోరాటం చేద్దామని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వి వెంకటేశ్వర్లు సహాధ్యక్షులు సురేష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి నాగవేణి పేర్కొన్నారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలోని గోపాల ప్లాజాలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి భాస్కర్ అధ్యక్షతన యుటిఎఫ్ 50వ ఆవిర్భావ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యుటిఎఫ్ జెండాను రాష్ట్రసహా అధ్యక్షులు ఎస్ సురేష్ కుమార్ ఆవిష్కరించారు. పత్తికొండ పట్టణంలోని యుటిఎఫ్ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ నుండి నాలుగు స్తంభాల కూడలి మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రచార జాత యాత్రను నిర్వహించి యుటిఎఫ్ 50వస్వర్ణోత్సవ వేడుకల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడుకుందాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించుకుందాం అన్న నిదానంతో జాత కొనసాగుతుందని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. జిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పి ఎస్ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యెహోషువ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప కార్యదర్శి జయరాజు సహధ్యక్షులు రవికుమార్ యుటిఎఫ్ మండల నాయకులు ప్రసాదు సత్యనారాయణ, ఈశ్వర్, రవి, ప్రకాష్ రెడ్డి, రంగస్వామి, వీరేష్, ఆలీ, భాష, ప్రజా సంఘాల నాయకులు గోపాల్, దస్తగిరి వెంకటేశ్వర్ రెడ్డి సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.










