Sep 24,2023 13:20
  • యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు.

ప్రజాశక్తి-బంగారుపాళ్యం : ఉపాధ్యాయులలో ఉద్యమ స్ఫూర్తి నింపుదామని రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రంలో యుటిఎఫ్ జండా ఆవిష్కరణ, బైకు జాత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినదని, ఇది ఉపాధ్యాయ బృందానికి స్వర్ణోత్సవం అని ఉపాధ్యాయ సమస్యలపై అనునిత్యం యుటిఎఫ్ పోరాడుతున్నదని, ఇదే స్ఫూర్తితో రాబోయే తరంలో వారు పోరాడి ఉద్యమ స్ఫూర్తిని నింపాలని అన్నారు. అనంతరం మాజీ యుటిఎఫ్ సభ్యులు సాంబశివ జండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఎస్ నాయుడు, జిల్లా గౌరవ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు సోమశేఖర్, జిల్లా కార్యదర్శి రమణ, మండల కమిటీ సభ్యులు సరిత ,మొగులయ్య, మోహన్ రెడ్డి, ధనంజయరాజు, రమేష్  నాగయ్య, రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.