Jan 24,2023 22:20

విరాళం అందజేస్తున్న బత్తల హరిప్రసాద్‌

కదిరి టౌన్‌ : తలుపుల మండల కేంద్రంలో ఈనెల 25 నుండి 27 వరకు నిర్వహించే హజ్రత్‌ సయ్యద్‌ షా బాబాషర్పోద్దీన్‌ ఉరుసు నిర్వహణకు వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్‌ తనవంతుగా విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన దర్గా కమిటీ సభ్యులకు రూ.15వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు బాహుద్దీన్‌, దర్గా ప్రెసిడెంట్‌ అందుమియా, ఆవజన్‌, చంద్ర, ఇమామ్‌ సాబ్‌, గౌస్‌ , సలీం, జాకీర్‌, సలీంబాషా, మహబూబ్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.