Jan 26,2023 21:17

విరాళాన్ని అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : కదిరి రూరల్‌ మండలం పట్నం గ్రామ పంచాయతీలో ఉత్సాహంగా ఎడ్ల బండి పోటీలు సాగాయి . పట్నం మాజీ సర్పంచి సుధీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎద్దుల బండ్ల పరుగుపందేన్నిఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఆ పార్టీ సిఇసి సభ్యులు పూల శ్రీనివాస్‌ రెడ్డి జెండా ఊపి పారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఏటా జనవరి మాసంలో సుధీర్‌ ఆధ్వర్యంలో ఎద్దుల బండిని పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి రైతు కు అభినందనలు తెలిపారు. ఈ పోటీలకు అయ్యే మొత్తం ఖర్చును పూల శ్రీనివాసరెడ్డి అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహులకు 80వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌ నాయక్‌, ఎంపీటీసీ కుమార్‌ రెడ్డి, స్కూల్‌ కమిటీ చైర్మన్లు ప్రభాకర్‌, అంజి, వీరాంజనేయులు, రామ్మోహన్‌ రెడ్డి, అనిల్‌, లక్ష్మీనారాయణ రెడ్డి, హనుమంత్‌ రెడ్డి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.