అమెరికా: యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సింధు చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యన్‌ను 21-14, 21-12తో ఓడించింది. ఇక లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాన్ లౌడాను 21-8, 23-21తో మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.










