- విద్యుత్తు షాక్ తో తండ్రి, కొడుకులు మృతి
ప్రజాశక్తి-గుంతకల్లు : అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లు ప్రాంతం ఆర్డిటి కార్యాలయం ఎదుట నివాసముంటున్న బోయ పుల్లన్న(50) గురువారం ఉదయం ఇంటి ఎదుట ఉన్న చెట్టును కొట్టేందుకు ఎక్కాడు. ఈ క్రమంలో చెట్టులోని కొమ్మ విరిగి హై టెన్షన్ విద్యుత్తు తీగలపై పడింది. దీంతో షాక్ గురైయ్యాడు. అక్కడే ఉన్న అతని కుమారుడు శివ (22)తండ్రిని పట్టుకోవడంతో అతడు విద్యుత్తు షాక్ కు గురై మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రూరల్ ఎస్సై సురేష్ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్న ఒక్క కొడుకుతో పాటు భర్త ఒకే రోజు మృతి చెందడంతో భార్య సుజాత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.










