- దసరా నాటికి పూర్తి మ్యానిఫెస్టో
- మహానాడు వేదికగా ఎన్నికల శంఖారావం పూరించిన చంద్రబాబు
ప్రజాశక్తి-ప్రత్యేక ప్రతినిధి (మహానాడు ప్రాంగంణం రాజమహేంద్రవరం) : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మహానాడు వేదికగా తొలిదశ మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇందులో ప్రధానంగా మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. భవిష్యత్తుకుగ్యారంటీ పథకం కింద ఆరు పథకాలను వెల్లడించారు. మహానాడులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన వీటిని సంబంధించిన వివరాలు తెలియజేశారు. మహాశక్తి పథకం కింద నాలుగు పథకాలను ప్రకటించారు. ఇందులో ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొనాురు. తల్లికి వందనం పథకం కింద చదువుకుంటును పిల్లల తల్లులకురూ.15 వేలు ఇస్తామనాురు. పిల్లలు ఎంతమంది ఉనాు అందిస్తామనిహామీ ఇచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని పేర్కొనాురు. ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామనాురు. ప్రతి మహిళనూ మహాశక్తిగా మారుస్తామని పేర్కొనాురు. జగన్ పాలనలో యువత భవిష్యత్ దెబ్బతిందని, వారికి దారి చూపే బాధ్యత టిడిపి తీసుకోవాల్సింది ఉందని అనాురు. యువగళం పథకం కింద నిరుద్యోగ యువతకు యువగళం నిధి పేరుతో నెలకు రూ.3 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని పేర్కొనాురు. అనుదాత పథకం కింద రైతులను ఆదుకునేందుకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తామనాురు. వ్యవసాయానిు లాభసాటిగా చేసేందుకు అవసరమైన అనిు చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామనాురు. టిడిపికి వెనొముకగా ఉను బిసిలకు రక్షణ చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. పూర్ టు రిచ్ పథకం కింద పేదలను సంపనుులుగా చేస్తామని, వారి ఆదాయం రెట్టింపు చేస్తామని పేర్కొనాురు. ప్రభుత్వ, ప్రయివేట్, ప్రజలు (పిపిపి) విధానంలో దీనినిఅమలు చేస్తామనాురు. ముగ్గురు పిల్లలు కంటే ఎక్కువ కలిగిన వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయకూడదనే చట్టానిు రద్దు చేస్తామని తెలిపారు. దసరా నాటికి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో ప్రకటిస్తామనాురు. ఈ పథకాలను ఇంటింటా కార్యకర్తలు ప్రచారం చేయాలనికోరారు. జగన్ పాలనలో రాష్ట్రం నాశనమయిందని, ఆయన పాలనకు చరమగీతం పాడాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందనాురు. రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి అందరూ సిద్ధం కావాలనికోరారు. ఎనిుకల ఆయుధం భవిష్యత్తు గ్యారెంటీ పథకం అనిపేర్కొనాురు. ఎనిుకల శంఖారావానిు మహానాడు వేదికగా ఆయన పూరించారు. అనేక సంక్షేమ పథకాలకుటిడిపి వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావు నాంది పలికారనితెలిపారు. ఎన్‌టిఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించామనాురు. 2014-19 కాలంలో టిడిపి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. టిడిపిని దెబ్బతీద్దామని ప్రయతిుంచిన ఎంతోమంది కాలగర్భంలో కలిసి పోయారనాురు. టిడిపి కార్యకర్తలను వేధించిన వారినిఎక్కడునాు వదిలిపెట్టబోమ నిహెచ్చరించారు. టిడిపి పేదల పార్టీ అని, వైసిపి ధనికుల పార్టీ అని పేర్కొనాురు. టిడిపి కార్యక్రమాలకు అడ్డుకోవాలనిచూస్తే తొక్కుకుంటూపోతామని హెచ్చరించారు. రాష్ట్రంలో సహజ వనరులను జగన్ దోపిడీ చేస్తునాురని ఆరోపించారు. గతంలో ఉచితంగా దొరికిన ఇసుక ఇప్పుడేందుకు దొరకడం లేదని ప్రశించారు. రాష్ట్రంలో జె ట్యాక్స్ వల్ల పారిశ్రామికవేత్తలు, అప్పులతో రైతులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందనాురు. రాష్ట్రంలో పేదల డబ్బు దోచేవారితో యుద్ధమని, దోచుకును వారి నుంచి కక్కించి పేదలకుదక్కేలా చేస్తామనిపేర్కొనాురు. వివేకా హత్యకుజగన్ సమాధానం చెప్పాలనిడిమాండ్ చేశారు. వందల కోట్ల రూపాయల ఆస్తి ఉను జగన్ పేదవాడు ఎలా అవుతాడని ప్రశించారు. రాష్ట్రానికి టిడిపి అవసరం ఉందని, ఎన్‌టిఆర్ పెట్టిన పార్టీనే రాష్ట్రానిు కాపాడుతుందని అనాురు.
- టిడిపికి పూర్వ వైభవం ఖాయం : బాలకృష్ణ
అనిు వర్గాల ప్రజలనూ అవస్థల పాలు చేసి, అన్ని వ్యవస్థలనూ నాశనం చేసిన ప్రస్తుత పాలనపోయి టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయమని హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎన్‌టిఆర్ టిడిపిని పెట్టి అధికారంలోకొచ్చాక ఎనోు సంస్కరణలు తెచ్చారనాురు. పేదవాడి ఆకలి తీర్చారని తెలిపారు. అందరిలోనూ రాజకీయ చైతన్యం నింపారనాురు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారనిగుర్తు చేశారు. అందుకే ఆయన మహానుభావుడు అయ్యాడని, మహానుభావుడు అవ్వాలంటే మహోనుత వ్యక్తిత్వం, ఆదర్శం వంటి మంచి లక్షణాలు ఉండాలనాురు. కానీ, ఇప్పుడు వేరే రకం మహానుభావులను చూస్తునాుమని పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టిడ్కో ఇళ్లను లభ్ధిదారులకు ఇవ్వకుండా తాత్సారం చేశారనాురు. కూలిపోయే దశకు వచ్చిన తరువాత ఇస్తారేమో అని పేర్కొనాురు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాలేదని, ఉను పరిశ్రమలు తరలిపోతునాుయని అనాురు. నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. అదే సమయంలో దేశంలోనే నెంబర్ వన్‌గా గంజాయి, డ్రగ్స్ రవాణాలో మన రాష్ట్రానిు నిలబెట్టారని దుయ్యబట్టారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదాలను జగన్ ఎందుకుగాలికి వదిలేశారని ప్రశిుంచారు.










