Jan 08,2021 00:36

సమావేశంలో మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు

దేవరాపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శ్రీ దత్త సాయి ట్రస్టు వ్యవస్థాపకులు పోతల నాయుడు ఆధ్వర్యాన ఎం.అలమండ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కీర్తిశేషులు పోతల వెంకటరమణ వర్థంతిని పురస్కరించుకొని గ్రామంలోని పేదలకు చీరలు, దుప్పట్లు, నూతన వస్త్రాలు, విద్యార్థులకు పుస్తకాలు, యువకులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, మానవసేవే మాధవసేవ అనే లక్ష్యంతో ట్రస్టు సభ్యులు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కల నాయుడుబాబు, గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాదరావు, కురసా నర్సింగరావు, పాత్రుని సింహాచలం నాయుడు, పోతల పాత్రునాయుడు, గొర్ల గోవింద, బండారు లెక్కల సత్యం, తాడి చంటి పాల్గొన్నారు.