Jan 26,2023 21:20

కార్యక్రమంలో పాల్గొన్న సిఐ, నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి -పెనుకొండ : ట్రాన్స్‌పోర్ట్‌ రంగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపుతున్నాయని ట్రాన్స్‌పోర్ట్‌ రంగం జిల్లా అధ్యక్షులు గౌస్‌ లాజం విమర్శించారు. గురువారం పట్టణంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కార్ల డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐ కరుణాకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పక పాటించాలన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గౌస్‌లాజం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వయంకృషితో బ్రతుకుతున్న ప్రైవేట్‌ వాహనాల ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌కు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సివిల్‌ సప్లై హమాలీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, సిఐటియు మండల నాయకులు తిప్పన్న, మహబూబ్‌బాషా, రెడ్డప్ప, శ్రీకష్ణదేవరాయ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ యూనియన్‌ నాయకులు శోభన్‌ బాబు, పి రవి, లక్ష్మీప్రసాద్‌, రాజారెడ్డి ,హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.