Jul 09,2021 12:26

హైదరాబాద్‌ : తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి ఎల్‌.రమణ రాజీనామా చేశారు. నిన్న సిఎం కెసిఆర్‌ ను ఎల్‌.రమణ కలిశారు. టిడిపి కి రాజీనామా చేస్తున్నట్లు ఎల్‌.రమణ చంద్రబాబుకు లేఖ పంపారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు పంపిన లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టిఆర్‌ఎస్‌ లో చేరుతున్నానని అన్నారు. 30 ఏళ్లపాటు తోడ్పాటు అందించినందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి ఎల్‌.రమణ కృతజ్ఞతలు తెలిపారు.