Feb 27,2023 19:26

ధ్రువపత్రం తీసుకుంటున్న రామసుబ్బారెడ్డి

ధ్రువపత్రం అందజేసిన రిటర్నింగ్‌ అధికారి
ప్రజాశక్తి-కడప : ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నామినేషన్లకు ఉపసంహకరణ కావడంతో ఒకటే నిమినేషన్‌ ఉండటంతో ఆయన ఎన్నికన ఎకగ్రీవమైంది. జాయింట్‌ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయి కాంత్‌ వర్మ తన చాంబర్‌లో రామసుబ్బారెడ్డికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువపత్రం అందజేశారు. కార్యక్రమంలో మేయర్‌ సురేష్‌ బాబు, డిప్యూటీ మేయర్‌ నిత్యానందారెడ్డి పాల్గొన్నారు.