Dec 31,2020 07:57


హస్తిన సరిహద్దుల్లో
ఆకలి, చలితో రైతుల
మరణమృదంగం!
కరగని నీ హృదయం
కఠిన పాషాణం
ఆగదు ఈ ఉద్యమం!
సాగదు నీ కౌటిల్యం!!
పట్టు వదిలేది లేదు
మెట్టు దిగేది లేదు
గుట్టుచప్పుడు కాకుండా
'మూడు'చట్టాలతో
రైతులను వంచించే
కార్పొరేట్ల 'కుట్ర'ను
భగం చేసి తీరుతాం!!
ప్రజల్ని బానిసలుగా
విద్యా హీనులుగా మార్చి
మూఢనమ్మకాలనెక్కించి
అణచిపెట్టాలనుకున్న
దీర్ఘకాల 'ఆర్య' కుట్రను
భారతప్రజలు 'భగం' చేసే
రోజులు దగ్గర పడ్డాయి!!
అన్ని దానాలలో 'అన్నదానం
మిన్న' అన్న పుణ్యదేశం!
అన్నదాతను మట్టుబెట్టే
చట్టాలెందుకు చేశారు?
పాలక కార్పొరేట్ల మైత్రితో
మీరు సాధించాలనుకున్న
కుట్ర బహిర్గతమైంది!!
ఆదానీలకు అంబానీలకు
దేశాన్ని తాకట్టు పెట్టి
శాశ్వత అధ్యక్ష పాలనను
చెలాయిద్దామనుకున్న
నీ 'కుట్ర' బద్దలయింది
రాష్ట్రాలనీ, మీడియాని కొనే
ధనం వాళ్ళిస్తారు కదూ!!
పదవి కోసం దేశద్రోహం
'మను' రాజ్య స్థాపనం
సాగించాన్న నీ కుట్ర
యావద్భారత ప్రజలు
బద్దలు కొట్టటం ఖాయం
జనసంద్రం పెల్లుబికింది
నీకుట్రకిది భగపర్వం!
తప్పదు నీకు 'శృంగభంగం'!!

- తమ్మినేని అక్కిరాజు