Jul 17,2021 11:21

శ్రీశైలం : రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్‌ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా నమోదయింది. ఔట్‌ ఫ్లో 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టిఎంసి లు కాగా ప్రస్తుతం 34.1004 టిఎంసి లుగా ఉంది. ప్రస్తుతం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం కాలేదు.