ప్రజాశక్తి - రాయచోటి : సామాన్య ప్రజల సమస్యల పరిష్కరమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పని చేయాలని అధికారులను కలెక్టర్ గిరీష పిఎస్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హల్లో స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా, డిఆర్‌ఓ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమా మహే శ్వరమ్మ జిల్లా నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్పందన కార్యక్రమానికి సమస్యలపై ప్రజలు నుంచి వచ్చే అర్జీలను పరిష్కరించటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పందనలో వచ్చిన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా చదివి సత్వరం పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కరించటానికి వీలుకానివి సరైన కారణాలతో అర్జీదారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. అర్జీలు పునరావతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. పరిష్కరించిన అర్జీలు రీ ఓపెన్ కాకుండా సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్క రించా లన్నారు. అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ లోకి వెళ్లకుండా నిర్దేశించిన గడుపులోపల క్లియర్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై బాధితులు వినతి పత్రాలు సమర్పించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కలెక్టర్, జేసి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వివిధ జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.










