Feb 27,2023 18:51

నియామక పత్రం అందుకుంటున్న మోహన్‌

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : సమాచార హక్కు కార్యకర్తల సంఘం జిల్లా కో-కన్వీనర్‌గా మదనపల్లి శ్రావ్య ఇన్ఫోటెక్‌ డైరెక్టర్‌ జె.మోహన్‌ని శనివారం సమాచార హక్కు కార్యకర్తల సంఘం వ్యవస్థాపకులు ముత్తు అధికారకంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలను ఒక వేదికపై తీసుకు వచ్చి సమాచార హక్కు చట్టం గ్రామ స్థాయిలో ప్రచారం చేయడానికి సంస్థ తరపున కృషి చేస్తామని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం సమాచారం సేకరించి అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకునే విధంగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కార్యకర్తల సంఘం అన్నమయ్య జిల్లా కో-కన్వీనర్‌ గా బాధ్యతలు అప్పగించిన సంస్థ వ్యవస్థాపకులు ముత్తు, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆంజనేయులు, రాష్ట్ర జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జివిఎస్‌.బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భగా ఆర్‌టిఐ కమిటీ మెంబర్లు రమేష్‌ బాబు, శివప్రసాద్‌, మడక సుబ్రహ్మణ్యం సమాచార హక్కు చట్టం-2005 ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా అవగాహన కలిగించేలా కృషి చేస్తామని తెలిపారు.