ప్రజాశక్తి - బత్తలపల్లి : సమాజంలోని తోటి వారికి సహాయపడే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆర్డీటీ అసోషియేట్ డైరెక్టర్ అన్నేఫెర్రర్ పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ రిలే ఆల్ట్రా మారథాన్ పరుగు ముగింపు సమావేశానికి ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి. అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా అన్నేఫెర్రర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాంఛూ ఫెర్రర్, మహిళా సాధికారిత డైరెక్టర్ విశాలా ఫెర్రర్, మారథాన్ రన్ పౌండర్ హువాన్ మాన్వెల్, లూస్ మరియా హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థను జిల్లాలో స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుందన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే సంస్థ లక్ష్యమన్నారు. దాతలతో పాటు లబ్ధిపొందుతున్న వారు, ప్రజలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నారు. అల్ట్రా మారథాన్ పరుగును జిల్లాలో చేపడుతున్న జువాన్ మాన్వెల్‌ను అభినందించాలన్నారు. ఇది ఇలాగే కొనసాగిస్తామన్నారు. వచ్చే మారథాన్ రన్ ను ఎలా చేయాలనే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. మారథాన్ రన్‌లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హువాన్ మాన్వెల్ మాట్లాడుతూ వారం రోజులుగా కష్టపడి ఇది చేపట్టిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు సేవలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు తొమ్మిదవ మారథాన్లో అందరం కలుసుకుందామన్నారు. లూస్ మరియా మాట్లాడుతూ ఈ రన్ ద్వారా చాలా మంది జీవితాల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ నిధినిఆర్జీటి చేపట్టిన వివిధ అభివద్ధి పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సాగర్ మూర్తి, సాయికష్ణ, చంద్రశేఖర్ నాయుడు. నాగేశ్వరరెడ్డి, నిరంజన్, షీబా, రాధ, దాదాఖలందర్, సిర్రెప్ప, మల్లిఖార్జున, ప్రమీల, డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎటిఎల్ రుక్మాంగదతో పాటు ఆర్డీటి సిబ్బంది, స్పానిస్ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.










