హైదరాబాద్ : గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సైయెంట్ తమ కార్యాలయాల్లోని మహిళలతో సమానంగా పురుషులకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సెలవుల సమయంలో ఉద్యోగులు పూర్తి వేతనాన్ని అందుకొనున్నారని పేర్కొంది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సైయెంట్ మానవ వనరుల అధికారి పిఎన్‌ఎస్‌వి నరసింహం తెలిపారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు తమ కొత్త విధానం తోడ్పడనుందన్నారు.










