ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి వ్యక్తులైన ఉపేక్షించరాదని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి వారితో నైనా రాజీపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళలపై జరిగే నేరాలను కట్టడి చేచాలన్నారు. పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకలిగేలా సిబ్బంది పనితీరు ఉండాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే స్పందన పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలీసును ఉద్యోగంగా కాకుండా సేవగా భావించి ప్రజలకు సేవ చేయాలని ఎస్పీ సూచించారు. ఈసమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్, ఎస్‌బి డిఎస్‌పి ఉమ మహేశ్వర రెడ్డి, డిసిఆర్‌బి సిఐ సుబ్బారావు, వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలోని పలువురు డీఎస్పీలు, సిఐ లు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.










