Nov 27,2022 21:50

రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు

ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల కేంద్రంలోని పలు కాలనీల్లో రోడ్లపై మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినాయక్‌ నగర్‌ లోగల మురుగుకాలువలో చెత్త పేరుకుపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు విజృంభించడంతో రోగాలబారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. సమస్యను పలుమార్లు పంచాయతీ సిబ్బందికి తెలియజేసిన పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.