Jan 26,2023 21:18

ర్యాలీలో పాల్గొన్న నాయకులు

నల్లచెరువు : రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతుసంఘం జిల్లా నాయకులు బడాసుబ్బిరెడ్డి డిమాండ్‌ చేశారు. రైతుసమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రంలో గురువారం రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బడా సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలు పండక తీవ్రంగా నష్టపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పరిస్థితిని పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, శివన్న, వివి రమణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.