ఓబుల దేవర చెరువు : రాష్ట్రంలో దోపీడీ పాలన సాగుతోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని అల్లాపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెబుతూనే రైతులకు చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, నాయకులు బోయపల్లి శివారెడ్డి, షబ్బీర్‌బాషా, చాంద్‌బాషా , షాను, ఆరీఫ ఖాన్, అంజినప్ప, మీసేవ సుధాకర్, నాగరాజు, కంచి సురేష్ తదితరులు పాల్గొన్నారు
రొళ్ల : మండలంలోని బిజి. హళ్లి పంచాయతీలో బుధవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా గుండుమల మాట్లాడుతూ టిడిపి చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి అనే కార్యక్రమానికి మంచి ప్రజాధారణ లభిస్తోందన్నారు. దీనిని చూసి ఓర్వలేని వైసిపి నాయకులు టీడీపీ కార్యకర్తల పింఛన్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొంకల్లు క్రిష్టమూర్తితో పాటు నాయకులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
రొద్దం : టిడిపి హయాంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి అన్నారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి, గౌరాజుపల్లిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో బికె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, అధికార ప్రతినిధి నరసింహులు, చిన్నప్పయ్య, చంద్రమౌళి, మాధవ నాయుడు, మురళి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










