May 11,2023 11:56

ప్రజాశక్తి-తిరువూరు : ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా తిరువూరు మండలం తిరువూరు మును కుళ్ళ.వావిలాల రాజు గూడెం అక్కపాలెం గ్రామాల్లో ఉపాధి కూలీల పని ప్రాంతం లో వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నాగరాజు పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలకు ఎక్కువ రోజులు పని చూపించటం లేదని కూలీల ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీల డబ్బులు రావడం లేదన్నారు. గత సంవత్సరాల్లో పనిచేసిన బకాయిలు ఉన్నాయని కూలీలు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు కూలీలతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనికి బడ్జెట్ తగ్గించడమే కాకుండా రెండు పూటల పని తీసుకురావడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది అన్నారు. ఎండ తీవ్రత ఉండటం వలన దుర ప్రాంతాలకు వెళ్లి పని చేసే కూలీలు ఉన్న పెద్ద సంఖ్యలో ఉన్న వ్యక్తులు ఎండకి వెళ్లి రావటానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కావున ఉపాధి కూలీలు సమస్యలపై ఈనెల 17న పిడి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఆలీబాబా ఉద్దండు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.