ప్రజాశక్తి-చందర్లపాడు : భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై చింతలపాడు మెయిన్ సెంటర్ నందు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు చందర్లపాడు మండల కార్యదర్శి వేల్పుల ఏసోబు మాట్లాడుతూభవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పని చేయనీయకుండా సర్కులర్ నెంబర్ 12, 14 విడుదల చేసింది. బోర్డు నిధులు జీవో 17 విడుదల చేసి వాడుకుంటున్నది. వాటి వల్ల వేలాదిమంది కార్మికులు పథకాలు కోసం దరఖాస్తు చేసుకొని పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. వేలాదిమంది కార్మికులు సంక్షేమ బోర్డు లో పేర్లు నమోదు చేసుకొని గుర్తింపు కార్డులు కోసం ఎదురుచూస్తున్నారు. నేను ఉన్న నేను విన్న నేను చూశాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికులు గోడు వినిపించడం లేదా హైకోర్టులో సైతం వాయిదాలు తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా ఇసుక సిమెంట్ కంకర్ లాంటి నిర్మాణ మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనివల్ల నిర్మాణ కార్మికులకు పనులు తగ్గిపోయి పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. తక్షణమే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులు పని చేయించి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ పరిష్కరించాలి. పథకాలు నిలిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్లర్ 12,14న ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ బోర్డు నిధులు తిరిగి చెల్లించాలని, ఇసుక సిమెంట్ స్టీల్ తదితర నిర్మాణం మెటీరియల్ ధరలు తగ్గించాలి. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ నాయకులు బి కోటేశ్వరరావు, బి నాగరాజు, తోట శీను, ఎస్.కె మౌలాలి, జి సాంబయ్య, పిట్టా శీను తదితరులు పాల్గొన్నారు.










