Jan 26,2023 21:15

కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్సీ, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గురువారం నుంచి చింతపండు వ్యాపారాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఇక్బాల్‌, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గిరిజమ్మలు పాల్గొని వ్యాపారాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతు హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే చింతపండు ఆసియా ఖండంలో ఉండే అన్ని దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. ఈ సందర్బంగా మండి మర్చంట్స్‌ ఆసోసియేషన్‌ ఆద్వర్యంలో 1500 మంది రైతులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండి మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీకాంత్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పి శ్యాంబాబు, కార్యదర్శి దీపక్‌, కోశాధికారి శేషు, మల్లికార్జున, వీరేష్‌ తదితరులు పాల్గొన్నారు.