పుట్టపర్తి రూరల్ : మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ఎంతో ఆదర్శమైనవని, వాటిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు కలెక్టరేట్‌లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ సమావేశపు మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కలెక్టర్ బసంత్‌కుమార్, జిల్లా వ్యవసాయ అడ్వైజర్ కమిటీ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురౌతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి, అందరికీ చదువు ఎంతో అవసరమని పాఠశాలలను స్థాపించిన మహనీయుడు పూలే అన్నారు. భారతదేశంలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిని స్ఫూర్తి ప్రదాత జ్యోతిరావుపూలే అన్నారు.










