పెనుకొండ : ప్రతి ఇంటికి నవరత్న పథకాలతో లబ్ది చేకూరుతోందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. నగరపంచాయతీ పరిధి 19 వ వార్డు పరిధిలోని కోనాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లిప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫరూక్ , మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ , వైస్ చైర్మన్లు సునీల్ కుమార్, వైసిపి టౌన్ కన్వీనర్ నరసింహ, మండల కన్వీనర్ నాగలూరు బాబు , ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ గుట్టూరు శ్రీరాములుతో పాటు ఆయాశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎక్కడకు వెళ్లిన ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం పుట్టపర్తిలోని రెండవ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళపతి, వైస్ చైర్మన్ శ్రీ లక్ష్మీ నారాయణ రెడ్డి, పుడా చైర్‌పర్సన్ లక్ష్మి నరసమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, కన్వీనర్ రంగారెడ్డి, కౌన్సిలర్లు చెరువు భాస్కర్ రెడ్డి, సూర్య గౌడ్, సాయి గీత, సింగల్ విండో అధ్యక్షుడు ఋషికేశవరెడ్డి, నరసారెడ్డి, బిల్డర్ మల్లి తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : సమస్యల పరిష్కారం కోసమే ప్రజల వద్దకు వచ్చామని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం హిందూపూరం రూరల్ మండలం బేవినహళ్లి పంచాయతీ పరిధిలో గల సంజీవరాయనిపల్లి, ఊడగలపల్లి గ్రామాలలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఆనంద్, జెడ్పీటీసీ నాగభూషణ, వైస్ ఎంపీపీ రఘునాథ్ రెడ్డి, మల్లేష్, వైస్ సర్పంచి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోనిఆర్‌ఎస్ రోడ్డు, గాంధీ నగర్ మౌనిక థియేటర్ మురాద్ షా మసీద్ వీధుల్లో బుధవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పరికి నజీమున్నీసాసాదిక్, వైస్ చైర్మన్లు కొమ్ము గంగాదేవి శంకర్, రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు నాషీర్, జిలాన్, ఇస్మాయిల్, ప్రణీత్ రెడ్డి, రంగారెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.










