Telangana : నాగోలు (తెలంగాణ) : తెలుగు సినిమా ఇండిస్టీలోని ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ పేరును వాడుకొని ఆమెను మానసికంగా వేధించిన షార్ట్ ఫిలిం డైరెక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకెళితే... మెడికాయల నవీన్‌కుమార్ (34) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. గత నెల ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్‌తో నవీక్‌కుమార్ ఇంటర్వ్యూ చేశాడు. ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీద ఒక యూట్యాబ్ చానెల్ ను ప్రారంభించాడు. తరువాత బాధితురాలి పేరు మీద ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అతను తన వెబ్ సిరీస్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సింగర్ ఇలాంటి కార్యకాపాలను ఆపాలని అతడిని కోరింది. నిందితుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. సింగర్ వ్యక్తిగత జీవితానికి సంబంధిన వీడియాలను సైతం అప్‌లోడ్ చేస్తూ ఆమెను మరింత మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్క్రెమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.










