లక్కిరెడ్డిపల్లి
వైసిపి పాలనలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా కల్పించడమే తమ ధ్యేయమని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మండంలోని కుర్నూతల పంచాయితీ లో దిగువ వడ్డేపల్లె, ఎగువ వడ్డేపల్లె, పందిళ్ళ పల్లె పంచాయితీలో సోమలవాండ్లపల్లె, బూర్జుపల్లె, పెద్దపల్లె, పందిళ్ళ పల్లె, కొక్కంటివాండ్లపల్లె, కుప్పంవాండ్లపల్లె, శ్రీరామపురం, వడ్డేపల్లె, కోతలగుట్టపల్లె, నల్లగుండ్లపల్లె లలో నిర్వహించిన ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాము కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి మొత్తం పది అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం చేపట్టిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడంతో నాయకులు ముఖం చాటేస్తున్నారని ఆరోపించారు. 'రాష్ట్రానికి ఇదేం కర్మ, రచ్చబండ , కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతుందన్నారు. ప్రజల పరిస్థితులు ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్యల్ని తెలుసు కొని అవగాహన కల్పించి వాటిపై చర్చ జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా ఆకాశంలో ధరలు, పేదలకు భయం, గుప్పెట్లో ఆడబిడ్డలు, నిరుద్యోగ యువత, భవిత చిత్తు, గిట్టని గిట్టుబాటు ధరలు, రైతన్నల ఆత్మహత్యలు, గుంతల మయమైన రోడ్లు, మన ఇసుక ఎక్కడికి వెళుతుందో జగన్ కే ఎరుక, నిధులు లూటీ, ప్రశ్నించిన వారిపై లాఠి, షాక్ కొట్టించే కరెంటు ధరలు, ఇలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతును చేస్తున్నామని చెప్పారు.
వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు
కుర్నూతల వడ్డేపల్లెలో ఐదు కుటుంబాలు వైసిపి నుంచి టిడిపిలోకి రమేష్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. పందిళ్ళపల్లె పంచాయతీ కోతలగుట్టపల్లె వైసిపి ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కుర్నూతల పంచాయతీ మాజీ సర్పంచ్ వేముల వెంకటరమణ, వేములమల్లిఖార్జున, క్రిష్ణనాగార్జున, యూనిట్ ఇన్‌ఛార్జ్ వెంకట్రామరాజు, మండ్ల రామాంజనేయులు, జొన్న రామ్మోహన్, శ్యామా, వేములగంగరాజు, వెంకటస్వామి, రేపన ఆనంద్ ,రేపన రెడ్డేయ్య, రమణ, వేముల చిన్న రమణ, హరినాధ , నాగరాజ బొట్టుడు, యోగేశ్వర పాల్గొన్నారు.










