కదిరి టౌన్ : ప్రజాశ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 23 వ వార్డు కౌన్సిలర్ శాన్వాస్ ఆధ్వర్యంలో కొలిమి బజార్, లాటర్ హౌస్ వీధి, మదర్ వీధి, తదితర కాలనీల్లో సోమవారం నిర్వహించిన గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షాకీర్, మున్సిపల్ చైర్‌పర్సన్ పరికి నజీమున్నీసాసాదిక్, మున్సిపల్ కమిషనర్ హరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాజశేఖర్ రెడ్డి, కొమ్ము గంగాదేవి శంకర్, ఎస్‌ఎండి ఇస్మాయిల్, కౌన్సిలర్లు ఇస్మాయిల్, ఖాసీంతో పాటు పలువురు కౌన్సిలర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరిగి : జగన్మోహన్ రెడ్డి పాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే శంకర్నారాయణ తెలిపారు. సోమవారం పరిగి మండలంలోని శ్రీరంగరాజులపల్లి పాపిరెడ్డి పల్లి ముళ్ళమోతకుపల్లిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు సౌజన్య లక్ష్మి, సరస్వతి, విజయభారతి, లక్ష్మీదేవితో పాటు మండల నాయకులు మాలక్క, వేదవతి, నరసింహారెడ్డి, ప్రభాకర్, డివి రమణ, శ్రీనివాసులు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.










