తాడిమర్రి : మండలంలోని చిల్లవారి పల్లిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్ రెడ్డి, సర్పంచి శివారెడ్డి, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వైటి చంద్రశేఖర్ రెడ్డితెఓ పాటు తహశీల్దార్ నాగరాజు, ఎంపీడీవో విజయలక్ష్మి ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మడకశిర రూరల్ : రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం జగనన్నతోనే సాధ్యమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. మండలంలోని మెలవాయి గ్రామంలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సరోజమ్మ. ఎంపీపీ కవిత, సర్పంచి రంగనాథ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో నరసింహమూర్తి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు
తనకల్లు తనకల్లు-3 గ్రామ సచివాలయం పరిధిలోని వంకపల్లి, డేగానివారిపల్లి, చిన్న కడపలవాండ్లపల్లి, కుంటమరవ, పెద్ద కడపలవాండ్లపల్లి, గ్రామాలలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కౌసల్య హేమంత్ కుమార్ నాయుడు, మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీవో నరసింహులు, సర్పంచ్ సరస్వతి, ఎంపీటీసీలు సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










