సమావేశంలో మాట్లాడుతున్న ఎంపిపి శ్రీదేవి రవికుమార్
కలకడ
ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి వెంటనే పరిష్క రించాలని ఎంపిపి శ్రీదేవి రవికుమార్ కోరారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల మండల సర్వసభ్య సమావేశాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించలేక పోతున్నామని అన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావన లేకుండానే తూతూ మంత్రంగా సమావేశాన్ని నిర్వహించి ముగించేశారు. కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ కమలాకర్‌రెడ్డి, ఎంపిడిఒ సిహెచ్.నారాయణ, సర్పంచులు, ఎంపిటిసిలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఒలు పాల్గొన్నారు.










