Jan 23,2023 21:43

కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్న వృద్ధురాలు

సోమందేపల్లి : మండల పరిధిలోని వెలగమాకులపల్లి తండాకు చెందిన లక్ష్మీ బాయి అనే మహిళ తనకు వితంతు పింఛను ఇప్పించాలని కోరారు. ఈ మేరకు ఆమె సోమవారం స్థానిక తహశీల్దార్‌ మురళీకృష్ణ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడతుఊ తనకు 75 సంవత్సరాల వయస్సు ఉందన్నారు. గతంలో నా భర్తకు పింఛను వచ్చేదన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత వితంతు పింఛను తనకు ఇప్పించాలని సంవత్సరం కాలంగా దరఖాస్తు చేస్తూనే ఉన్నానన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.