Feb 28,2023 19:12

కరపత్రాలు పంపిణీ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ఉద్యమ నేపథ్యమున్న పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు పట్టణంలోని పలు విద్యా సంస్థలలో మంగళవారం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులు పట్ల వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. ఉద్యమ నేపథ్యం కలిగిన పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు అండగా నిలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.శివరామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు దినేష్‌, నియోజకవర్గ కార్యదర్శి మహమ్మద్‌ పాల్గొన్నారు.